రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

జనసేన పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ రామగుండం కార్పొరేషన్ యూత్ కోఆర్డినేటర్ సుద్దాల అనురాజ్ మరియు యూత్ సభ్యులు

రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ యూత్ కోఆర్డినేటర్ సుద్దాల అనురాగ్ రాజ్ ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆర్గనైసింగ్ కార్యదర్శి మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో సుద్దాల అనురాజు మరియు వారితో పాటు యూత్ సభ్యులకు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. అనురాజు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని రామగుండం నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పార్టీని ముందు తీసుకెళ్తూ సైనికుడిగా పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మోతే రవికాంత్, బండారి తిరుపతి, తుంగపల్లి కుమార్, బండారి సంతోష్, సాయి, తెగుట్ల మనోజ్, గూరాళ్ల మనోజ్, అతిశయి, శోభిత్, రోహిత్, వినయ్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.