ఓటమి భయంతో ప్ర‌లోభాల‌కు తెర‌లేపిన వైసీపీ

  • అన్ని రంగాలను నాశనం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ
  • ఓడి పోతున్నామ‌ని తెలిసి ప్ర‌లోభాల‌కు తెర‌లేపిన వైసీపీ
  • వైసీపీ ప్ర‌లోభాల‌కు లొంగితే భ‌విష్య‌త్తు అంథ‌కార‌మే
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: ఐదేళ్ల పాల‌న కాలంలో రాష్ట్రం అన్న విధాలుగా అథోగ‌తి పాలైంద‌ని, రాష్ట్రంలో సుస్థిర, సమర్ధవంతమైన పాలన రావాలని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెంటేల బాలాజి పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ వైసీపీ దోపిడీని అరికట్టి ఆ పార్టీని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్ర‌తి ఒక్క‌రి ఆవేశం, ఆక్రోశం, ఆవేద‌న ఓట్ల రూపంలో చూపాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పురోగమనం దిశగా సాగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల‌ని ఈ దిశ‌గా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అడుగులు వేయాల‌ని సూచించారు. అన్ని రంగాలను నాశనం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్లబోతోందని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని స్ప‌ష్టం చేవారు. వైసీపీ ప్ర‌లోభాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
రాష్ట్రంలో అధికారంలోకి రాలేమ‌ని తెలిసిపోవ‌టంతో వైసీపీ ప్ర‌లోభాల‌కు తెర‌తీసింద‌ని బాలాజి ఆరోపించారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రంగా ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైసీపీ ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైందన్నారు.. మ‌రోవైపు కులాలు,మ‌తాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చ‌గెట్టి ప‌బ్బం గడుపుకోవాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. మ‌రోవైపు వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేద‌ని, వైసీపీ ప్ర‌చారానికి రావ‌టం లేద‌ని తాగునీటి సైతం అంద‌కుండా చేస్తున్న దుర్మ‌ర్గ చ‌ర్య‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌న్నారు. వైసీపీ ప్ర‌లోభాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఒక్క‌సారి ప్ర‌లోభాల‌కు గురైతే భావిష్య‌త్తు అంధ‌కారంగా మారుతుంద‌ని, రానున్న ఐదేళ్ల పాటు రాష్ట్ర ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు.