బాధ్యతను చాటుకున్న ఉమ్మడివరం జనసైనికులు

రంపచోడవరం: వి.ఆర్.పురం మండలంలో అన్నవరం గ్రామం వాగు వద్ద కూలిపోయిన బ్రిడ్జి పక్కన నుండి చిన్న వంతెన కట్టిన విషయం అందరికీ తెలిసిందే.. ఆ మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వ అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోని పరిస్థితి, వాహనాల డ్రైవర్లు ఆదమరిస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని గమనించిన ఉమ్మడివరం జనసైనికులు నూపా దినేష్, పాయం రమేష్, సోడే పోసిబాబు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా ఆ ప్రాంతంలో ప్రమాద స్థలం అని హెచ్చరిక కోన్ లు మరియు రెడ్ రిబ్బన్ లు అమర్చి జనం కోసమే జనసేన అనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా తమ బాధ్యతను చాటారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ వి.ఆర్.పురం మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ నాయకులు మరియు మండల వాసులు వారిని అభినందించారు.