జనసేన నాయకులకు, సానుభూతిపరులకు కృతజ్ఞతలు: అనుశ్రీ సత్యనారాయణ

  • సైకిల్, కమలం గుర్తులపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మెరుపు వేగంతో అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఆ పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ అన్నారు. ఆదివారం జనసేన నాయకులకు సానుభూతిపరులకు కృతజ్ఞతలు తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి జనసేన, టిడిపి, బిజెపి కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు టిడిపి బిజెపి శ్రేణులతో కలిసి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు చేసిన కృషికి జనసేన పార్టీ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. వార్డు స్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలుకొని, భారీ బైక్ ర్యాలీలు, వివిధ సంఘాలతో సమావేశాలు, చర్చల విషయంలో మనందరి కృషి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అనుకూలమైన ఫలితాలు రాబడుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ గందరగోళానికి గురికాకుండా ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై జాగ్రత్తగా ఓటు వేసి జనసేన పార్టీ తరపు నుండి కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయానందించాలని అందరికీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు జనసేన పార్టీ సానుభూతి పరులకు పేరు పేరునా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన కూటమి ఎంపీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.., వీరిరువురు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేశారు.