మేనల్లుడి సక్సెస్ కి ‘మెగా’ బహుమానం

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సత్తా చాటిన సంగతి తెలిసిందే. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు అయినప్పటికీ ఉప్పెన కలెక్షన్లు వంద కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందంటే ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థంచేసుకోవచ్చు. ఇక ఉప్పెన సినిమా కోసం శాటిలైట్, ఓటీటీ వేదికలు ఎదురుచూస్తున్నాయి. మరి అక్కడ ఎలాంటి ‘ఉప్పెన’లు సృష్టిస్తుందో చూడాలి. ఇదిలావుంటే, తాజాగా తన మేనల్లుడి సక్సెస్, ప్రతిభ చూసి గర్వంగా ఫీల్ అయిన మెగాస్టార్ చిరంజీవి, వైష్ణవ్‌కి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చారు. వైష్ణవ్‌ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని మరీ ఈ బహుమతిని అందించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేశారు.