పవన్ కల్యాణ్, క్రిష్ సినిమా టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో మరే హీరో కూడా చేయలేని స్థాయిలో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత తన 27వ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేస్తారనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను యూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రానికి ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో వజ్రాల దొంగగా పవన్ కనిపించనున్నట్టు సమాచారం. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ సరసన యువనటి నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.