‘ఆర్ఆర్ఆర్’లో అలియాభట్ లుక్‌ను విడుదల చేసిన రామ్ చరణ్!
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అలియా భట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్.. అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో సీతారామరాజు (చరణ్)కి జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, నా సీత ఇదిగో అంటూ చెర్రీ ఈ లుక్‌ను విడుదల చేశారు. చీర కట్టి, బొట్టు పెట్టి ఉన్న ఆమె లుక్ అలరిస్తోంది. రామరాజు కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు ఆమె కూర్చొని ఉంది.
కాగా, ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా గతంలో ఆమె ఫస్ట్‌లుక్‌ను ‘ప్రియమైన జెన్నిఫర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఎన్టీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.
Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary!
— rajamouli ss (@ssrajamouli) March 15, 2021
Presenting @aliaa08 as #Sita to you all 🙂@tarak9999 @AlwaysRamCharan #RRR #RRRMovie pic.twitter.com/NFe4WwjS6u