మంచిర్యాల: బాలికల పాఠశాలలో కరోనా కలకలం

తెలంగాణలోని జిల్లాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు దేశంలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత బాలిక పాఠశాలలో కరోనా కలకలం రేగింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. సోమవారం రోజున కొంతమంది టీచర్లు, విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు. ఇందులో 11 మంది టీచర్లకు, ఇద్దరు వంట వంటవాళ్ళకు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. దీంతో విద్యాశాఖ అప్రమత్తం అయ్యింది. పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థినిలకు కూడా ఈరోజు టెస్టులు నిర్వహించనున్నారు.