కోవిడ్, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష

దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.. ఇక, ఏపీలోనూ కేసుల తీవ్రత పెరుగుతూ వస్తోంది.. అయితే, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్‌కు అడ్డంకిగా మారిందని అభిప్రాయపడ్డ ఆయన.. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా ముగించాలన్నారు సీఎం వైఎస్ జగన్. 40 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ను సత్వరమే అందించేందుకు గ్రామ సచివాలయాలు కృషి చేయాలన్నారు. కరోనా పరీక్షలు మొత్తం నూటికి నూరు శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్.