నాగబాబు న్యూ లుక్.. పిక్స్ వైరల్

మెగా బ్రదర్ నాగబాబు తొలుత నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. చిరంజీవి నటించిన సినిమాలతో పాటు ఇతర హీరో సినిమాలలో నటించిన నాగబాబు కొన్నాళ్లకు నిర్మాతగా మారాడు. ఆయన నిర్మించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో కొంత ఊరట చెందారు.

జబర్ధస్త్ షోతో నాగబాబు ఫేట్ మారింది. ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగాబాబు మెల్లమెల్లగా ఇతర కార్యక్రమాలకు సైతం జడ్జిగా ఉంటూ నాలుగు కాసులు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది. అయితే ఇన్నాళ్లు జడ్జిగా అలరించిన నాగబాబు ఇప్పుడు మళ్లీ నటుడిగా అలరించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నాగబాబు రఫ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇది ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ సినిమా కోసం నాగబాబు ఇలా మారాడో తెలుసుకునేందుకు ఆరాలు తీస్తున్నారు. అతి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.