మెగా పవర్ స్టార్ బర్త్ డే.. అంబరాన్ని తాకిన సంబరాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు చరణ్ కు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. అయితే ఒక రోజు ముందే చరణ్ బర్త్ డే వేడుకలను మెగా అభిమానులు గ్రాండ్ గా జరిపారు.

శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మెగా అభిమానులు పాల్గొనడం విశేషం..ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జ లతోపాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సెట్‌లోను రామ్ చరణ్ బర్త్‌డే హంగామా ఓ రేంజ్‌లో జరిగింది. రాజమౌళి, డీవీవీ దానయ్యతో పాటు పలువురు యూనిట్ సభ్యుల సమక్షంలో రామ్ చరణ్ కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చెర్రీ బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య నుండి సర్‌ప్రైజింగ్ పోస్టర్స్ విడుదల చేయగా, ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశాయి.