మందుబాబులకు షాక్: ఈరోజు నుంచి రెండు రోజులు బంద్

ఈరోజు నుంచి రెండు రోజులపాటు తెలంగాణలో మద్యం షాపులు బంద్ కాబోతున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసేస్తున్నారు. ఈనెల 29,30 వ తేదీలు హోళీ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అటు హోళీ వేడుకలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోళీ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు, రెస్టారెంట్లకు హోళీ నిర్వహణపై నోటీసులు ఇచ్చారు. అలానే, నగరంలోని గేటెడ్ కమ్మూనిటీలపై కూడా పోలీసులు కన్నేసి ఉంచారు. ఎవరింట్లో వారు హోళీ పూజలు చేసుకోవాలని, కరోనా దృష్ట్యా ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.