సంజయ్ విరామం కారణంగా మరింత ఆలస్యం కానున్న కేజీఎఫ్2 విడుదల

ప్రశాంత్ నీల్ నిర్మించిన కేజీఎఫ్ చిత్రం గొప్ప విజయాన్ని అందుకున్న విషయం మనందరికి తెలిసిందే. కేజీఎఫ్ మూవీ ఎంతో ఆకట్టుకున్న నేపథ్యంలో ఇక ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం కంటే కూడా భారి బడ్జెట్‌తో రూపొందుతున్న కేజీఎఫ్ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

కేజీఎఫ్2 అక్టోబర్ 23 న విడుదల కావాల్సి ఉంది. కాని ఇప్పుడు సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో ఆయన కొన్నిరోజుల పాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ మూవీ 2021 సంక్రాంతికి వాయిదా పడింది.

కేజీఎఫ్2 మూవీలో సంజయ్ దత్ అధీర అనే విలన్ పాత్రలో నటిస్తుoడగా ఇటీవలే సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్2 మూవీ అధీర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ నేరుగా ఓ సౌతిండియన్ మూవీలో నటించడం ఇదే తొలిసారి కావడంతో అధీర ఫస్ట్ లుక్‌కి భారీ స్పందన లభించింది. కానీ ఇప్పుడిలా ఎవ్వరూ ఊహించనిరీతిలో సంజయ్ దత్ షూటింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి రావడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల మరి కొంత ఆలస్యం కావడం ఆ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి కొంత నిరాశను నింపింది.

సంజయ్ దత్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నప్పటికీ.. మిగతా యాక్షన్ పార్ట్స్‌కి సంబంధించిన షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. సంజయ్ దత్‌పై చిత్రీకరించాల్సి ఉన్న మిగతా సన్నివేశాలను ఆయన చికిత్స నుంచి తిరిగొచ్చాక షూట్ చేయనున్నట్టు సమాచారం.