RR vs DC: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌..

ఐపీఎల్ 14వ సీజన్ 7వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ రెండేసి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సీజన్‌లో ఆర్‌ఆర్ తన తొలి మ్యాచ్‌లో ఓటమి చవి చూడగా.. ఢిల్లీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరి చూడాలి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో..

ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్(కెప్టెన్), రహనే, స్టోయినిస్, వోక్స్, అశ్విన్, లలిత్ యాదవ్, రబడా, టామ్ కరన్, ఆవేశ్ ఖాన్

రాజస్థాన్ జట్టు: మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బట్లర్, శివం దూబే, రియాన్ పరాగ్, రాహుల్ టివాటీ, క్రిస్ మోరిస్, సకరియా, ఉనడ్కట్, రెహమాన్