మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్
కరోనా వైరస్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఊహించని స్థాయిలో వేగంగా విస్తరిస్తూ వైరస్ కోరలు చాస్తోంది. ఎందరో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ పోస్టుపై నటుడు నాగబాబుతోపాటు, నటి అవికాగోర్‌తో సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కళ్యాణ్‌దేవ్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.