క్వారంటైన్ లోనే పవర్ స్టార్.. కారణం..?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా నెగటీవ్ వచ్చిన ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నారు. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా వచ్చిన ఐదు రోజుల్లోనే ఆయన కోలుకున్నారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. కంగారు పడాల్సిన అవసరమే లేదని జనసేన వర్గాలతో పాటు సన్నిహితులు కూడా తెలిపారు. సాధారణంగా కరోనా నెగిటివ్ తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. కానీ పవన్ మాత్రం చాలా రోజులుగా క్వారంటైన్ లోనే ఉన్నారు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఈయన.. ఇప్పుడు క్వారంటైన్‌కు పరిమితం అయిపోయారు. అప్పట్నుంచి పవన్ బయటికి రావడం లేదు. పూర్తిగా తన ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నారు. అక్కడే వైద్యుల బృందం సమక్షంలో చికిత్స తీసుకోవడంతో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈయనకు నెగిటివ్ వచ్చినా కూడా లోపల స్వలంగా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. పవన్ ఊపిరితిత్తులు స్వల్పంగా ఇన్ఫెక్ట్ కావడంతో ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రమాదమేం లేదని.. పవన్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు సన్నిహితులు. కాకపోతే కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యుల సూచన. అందుకే నెగిటివ్ వచ్చాక కూడా బయటికి రావడం లేదు పవర్ స్టార్.