ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా మారి సేవలందిస్తున్నకన్నడ హీరో..

ప్రముఖ కన్నడ హీరో అర్జున్‌గౌడ కరోనా రోగుల కోసం అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారారు. కరోనా పరిస్థితుల్లో ఎవరికైనా సాయం చేయడానికే భయపడుతుంటే అర్జున్‌గౌడ మాత్రం.. కరోనాతో మరణించిన మృతదేహాలను స్మశానికి తరలిస్తూ.. రియల్‌హీరో అనిపించుకుంటున్నారు. ఈ హీరో ‘ప్రాజెక్ట్‌ స్మైల్‌ ట్రస్ట్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారానే ఆయన స్మశానికి మృతదేహాలను తరలిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అర్జున్‌గౌడ ఇటువంటి సేవ చేస్తూ చేస్తుండడంతో.. అందరూ అతనిని ప్రశంసిస్తున్నారు. కాగా అర్జున్‌ గౌడ ‘యువరత్న’, ‘రుస్తుమ్‌’ లాంటి సినిమాలతో హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నారు.