వకీల్‌సాబ్ సినిమాపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

పవన్  కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమాపై సుధాకర్ అనే వ్యక్తి నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమాలోని ఓ సన్నివేశంలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబరును వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నటిని అసభ్యకరంగా మార్చినట్టు ఉన్న ఫొటోల కింద తన ఫోన్ నంబరు ఉందని, దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రోజూ ఫోన్లు వస్తున్నాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫోన్ చేసిన వారు తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. తన ఫోన్ నంబరును వాడుకున్నందుకు సినిమా యూనిట్‌పై కేసు నమోదు చేయాలని కోరాడు. అయితే, పోలీసులు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.