ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కర్ఫ్యూ దృష్ట్యా పనివేళల్లో మార్పు..

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పించింది ప్రభుత్వం.. ఓ వైపు కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరగడం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయంలో గత 10 రోజుల్లో 14 మంది ఉద్యోగులు కరోనా సోకి మరణించారు. దీంతో అప్పటి నుంచి ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం.. కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది.

తమకు వర్క్ ఫ్రం హోమ్ కు అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కర్ఫ్యూ కఠినంగా అమలవడంతో కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకునే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించిన సీఎం జగన్. వారి పనివేళల్లో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో రేపటి నుంచి ఏపీలో ఉద్యోగుల పనివేళ్లలో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వారి పని వేళలను కుదిపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం పని చేయాల్సి వస్తే.. అందుకు హెచ్ ఓడీలు వారికి అనుమతి పత్రం ఇవ్వాలని.. అప్పుడే కర్ఫ్యూ ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్పారు.