నిహారికను ముందుగానే ఆశీర్వదించిన: పవన్ కల్యాణ్

నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు అందరూ నిహారిక నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఆ ఫోటోల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క పవన్ కల్యాణ్ తప్ప మిగతా అందరూ కనిపించారు. అది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా చర్చించుకోవడం ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ ఎందుకు నిహారిక నిశ్చితార్థానికి హాజరు కాలేదు అనే సందేహాలు తలెత్తుతుండగా…అందుకు అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓ దీక్షలో ఉన్నారని.. ఆ దీక్షలో ఉండటం వల్ల సాయంత్రం 6 గంటల తర్వాత బయటికి వెళ్లకూడదనే ఉద్దేశంతో నిశ్చితార్థం వేడుక కంటే ముందుగానే ఇంటికి వెళ్లి నిహారిక, చైతన్య జొన్నలగడ్డను ఆశీర్వదించారని ఫిలింనగర్ టాక్. అందువల్లే ఆయన నిశ్చితార్థంలో పాల్గొనలేకపోయారనేది ఆ టాక్ సారాంశం.