పోలీసులకు.. కొవిడ్‌ సపోర్టు సర్వీస్‌ సెంటర్

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం సీపీ అంజనీకుమార్‌ కొవిడ్‌ సపోర్టు కేంద్రాన్ని ప్రారంభించారు. 24/7 పనిచేసే ఈ కేంద్రం ద్వారా కరోనా బారిన పడిన పోలీస్‌ సిబ్బందికి దవాఖాన వసతులతో పాటు వైద్యులు, రవాణ సౌకర్యం తదితర అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా కొవిడ్‌ కిట్‌ను అందజేస్తారు.