ఏపీ నుంచి వచ్చే కోవిడ్ పేషేంట్ లకు అనుమతి నిరాకరణ..

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించడం లేదు తెలంగాణ పోలీసులు. కోదాడ మం. రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు చేస్తూ అంబులెన్స్‌ల్లో వస్తున్న రోగులను వెనక్కి పంపుతున్నారు పోలీసులు. ఏపీ నుంచి వచ్చే కోవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న కోవిడ్ పేషెంట్ లు తిరిగి ఏపీలోకే వెళుతున్నారు.