రేపటి నుంచే లాక్‌డౌన్ అంటే ఎలా?: హైకోర్టు సీరియస్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్ర కేబినెట్‌ లాక్‌డౌన్‌ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఏజీ ప్రసాద్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని తెలిపారు. ఇక్కడ ఉన్న వారి బాగోగులను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.

లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయని అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్ అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిటళ్లై చర్యలు తీసుకోమని తామెలా చెప్తామని అన్నది.