మాస్ మహారాజ సినిమా విడుదల థియేటర్లలోనే

మాస్ మహారాజ రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్, క్రాక్ సినిమా కేవలం రెండు వారాల షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబరులో క్రాక్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండడంతో క్రాక్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే విడుదల అవుతుందని గతంలోనే అనేక ఊహాగానాలు వస్తున్న నేపద్యంలో ఆ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విట్టర్ లో స్పందిస్తూ  క్రాక్ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మాస్ మహారాజ అభిమానులందరికీ ఈ ట్వీట్ సంతోషo కలుగచేస్తుందని ఆశిద్దాం.

ఈ సినిమాతో రవి తేజ మరియు శృతి హాసన్ లు మరోసారి జంటగా ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ఠాగూర్ మధు ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తుండగా ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.