ఆకట్టుకుంటోన్న ఫ్యామిలీ మేన్‌ -2 ట్రైలర్‌

మనోజ్‌ భాజ్‌పాయ్, ప్రియమణి, సమంత వంటి ప్రముఖ తారాగణం నటించిన వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మేన్‌ – 2 ట్రైలర్‌ బుధవారం విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదభరితంగా ఉంది. ముఖ్యంగా కీలకమైన పాత్రలో నటిస్తున్న సమంతకు ఇదే తొలి వెబ్‌ సిరీస్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ అక్కినేని వారి కోడలు ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్‌ సీజన్‌ 1తో సక్సెన్‌తో… సెకండ్‌ సీజన్‌పై భారీ అంచనాలను పెంచిందనే చెప్పుకోవచ్చు. సమంతా ఇందులో రాజీ అనే ఉగ్రవాది పాత్రను పోషిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో మనోజ్‌ భాజ్‌పేజ్‌, సమంత, ప్రియమణి క్యారెక్టర్లను ఎక్కువగా చూపించి…మరింత ఆసక్తిని పెంచేలా చేశారు చిత్ర నిర్మాతలు రాజ్‌..డికె. ఇక శ్రీకాంత్‌ (మనోజ్‌ భాజ్‌పాయ్) ఓ మధ్యతరగతి వ్యక్తిగా… జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో రహస్యంగా పని చేస్తూ.. ఆ ప్రభావం ఆఫీసులోనూ, ఇంట్లోనూ పడకుండా.. జాగ్రత్తగా పడుతుంటాడు.

దీంతో ఇంట్లో భార్య (ప్రియమణి)తోనూ సరిగ్గా మాట్లాడడు. ఇక ఆఫీసులో కూడా పని సరిగ్గా చేయడనే అపవాదు ఉంటుంది. అయితే ఉగ్రవాదులపై పోరాడే వీరసైనికుడిగా ఆయన నటించిన తీరు మెప్పిస్తోంది. మొత్తానికి ఆయా పాత్రలకు తగ్గట్టుగా శ్రీకాంత్‌ నటన అద్భుతంగా ఉంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్రయూనిట్‌ విడుదల తేదీని ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ వెబ్‌సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 4న విడుల కానుంది.