పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహ నిర్బంధం
పాలకొల్లు ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు సైకిల్ పై వార్డు, గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకునేందుకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచి నిమ్మల రామానాయుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఈరోజు నిమ్మల ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రమం ఆసుపత్రిలను సందర్శించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణ సిఐ సిహెచ్ ఆంజనేయులు సారథ్యంలో ఎస్ఐ రెహమాన్, పాలవలస వెంకట అప్పారావు, పోలీసు సిబ్బంది ఆయన గృహాన్ని చుట్టుముట్టారు.