గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రశంసిస్తూ ఎంపీ సంతోష్‌కుమార్ కు ప్రధాని లేఖ

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్త ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటారు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మరోకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరిన సందర్బాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సంతోష్ కుమార్‌ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోడి లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు.

పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎం.పీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతపై వృక్షవేదం పుస్తకం గురించి లేఖలో ప్రస్తావించారు. ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిన పుస్తకం వృక్షవేదం అని, పచ్చదనం దిశగా యువత ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఎంపీ సంతోషన్ చేస్తున్న బృహత్కర కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంనుండి గుర్తింపు లభిస్తోంది. మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యవరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్చమైన ఆక్సీజన్ తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, ఫిల్మ్ స్టార్స్, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్ ను స్వీకరించి మరొకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరారు.