జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన హైదరాబాద్‌లోని తననివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలంతో నేడు మనకు స్వేచ్ఛ సిద్ధించింది. వారందరినీ స్మరించుకొని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇది. అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖితపూర్వక రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా మన దేశాన్ని తీర్చిదిద్దారు. వ్యవస్థలకు తూట్లు పొడవడం, హక్కులు కాలరాయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించడం వ్యక్తి ద్రోహమే కాదు, సమాజ ద్రోహం కూడా. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ధోరణుల నుంచి వ్యవస్ధలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.