టీటీడీ ఆధ్వర్యంలో నిర్వీరామంగా సుందరకాండ పారాయణం పఠనం

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి రోజు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని పారదోలడం కోసం టీటీడీ ఆధ్వర్యంలో మే 31వ తేదీన సుందరకాండ పారాయణం పఠనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ధర్మగిరి వేద పాఠశాలలో 30 మంది పండితులు 16గంటల పాటు నిర్వీరామంగా సుందరకాండ పారాయణం చేస్తారని తెలిపారు. టీటీడీ చరిత్రలో మొట్ట మొదటి సారి ఏకధాటిగా 16 గంటల పాటు సుందరకాండ పారాయణాన్ని పఠనం చెప్పబోతున్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సుందరకాండ పారాయణం పఠనం కొనసాగుతుందన్నారు.