రామ్‌ సేతులో సత్యదేవ్ కు ఆఫర్..

టాలీవుడ్‌ హీరోలు బాలీవుడ్‌లోనూ రాణించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో అగ్రహీరోలతోపాటు, మిగతా హీరోలు కూడా అదే బాటే పడుతున్నారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడుతున్న హీరోల్లో సత్యదేవ్‌ కూడా ఒకరు. ఆయన నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం హిట్‌ కావడంతో.. ఆయనకు వరుస ఆఫర్లు దక్కాయి. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’, తిమ్మరుసు వాలి, గాడ్సే వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సత్యదేవ్‌కి బాలీవుడ్‌ నుంచి అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షరుకుమార్‌ నటిస్తోన్న ‘రామ్‌సేతు’ చిత్రంలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌ ఈ పాన్‌ ఇండియా చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుష్రత్‌ భారుచి మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్‌ సహకారంతో అమెజాన్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్‌తోపాటు, నాజర్‌ కూడా మరో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు సత్యదేవ్‌ చేరువకాబోతున్నారు. అక్కడ కనుక నిలదొక్కుకోగలిగితే.. ఆయన కూడా మరో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోతారేమో చూడాలి.