ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ ఒక్క విద్యార్థికి ఏం జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు పరీక్షల రద్దు పై నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది.

పరీక్షల నిర్వహణపై పై అఫడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించినా అఫిడవిట్ వేయలేదు. రెండు రోజుల్లో అఫడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా ఏపీ ప్రభుత్వం జూలై నెలలో పరీక్షలు నిర్వహించాలని మొదటి వారంలో ఇంటర్ , చివరి వారం లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.