శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 820 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు. ఇప్పుడు జలాశయంలో 40.8748 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్‌ ఉత్పత్తితో 21,189 క్యూసెక్కుల నీరుకు దిగువకు వెళ్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల డ్యామ్‌కు సైతం వరద తగ్గింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 5,497 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 1,833 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,041 అడుగుల మేర నీరుంది. ప్రస్తుతం 7.759 టీఎంసీల నీరుంది.