అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగమ్మాయి శిరీష బండ్ల‌కు చిరంజీవి శుభాకాంక్షలు!

అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి శిరీష బండ్లకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. గొప్ప కార్యానికి సిద్ధమైన శిరీష బండ్ల. తారలను చేరుకుంటోన్న మొదటి తెలుగు అమ్మాయి అని అన్నారు. ఆమె తల్లిదండ్రులు, తెలుగువారితో పాటు భారతీయులందరూ గర్వపడే సమయం ఇది అని పేర్కొన్నారు. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి శిరీష కి శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ నెల 11న ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరితో కలిసి తెలుగు మూలాలున్న యువతి శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతోంది.