ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ల్యాప్ టాప్ లను ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేయనున్నారు. పెద్దమొత్తంలో ల్యాప్ టాప్ లు కొనుగోలు చేస్తున్నందున ఆయా కంపెనీలు తక్కువ ధరకే అందించే వీలుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

కాన్ఫిగరేషన్ వివరాలు…

డ్యూయల్ కోర్ ప్రాసెసర్

4 జీబీ ర్యామ్

500 జీబీ హార్డ్ డిస్క్

14 అంగుళాల స్క్రీన్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ తో కూడిన ఓపెన్ ఆఫీస్

కాగా, ఈ ల్యాప్ టాప్ లకు మూడేళ్ల వారంటీ ఉంటుంది. అమ్మఒడి పథకంలో ఆర్థికసాయానికి బదులుగా ల్యాప్ టాప్ లు కోరుకునే విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ల్యాప్ టాప్ లు ఒకవేళ మరమ్మతులకు గురైతే వారం రోజుల్లో చేసి ఇచ్చేలా ల్యాప్ టాప్ కంపెనీకి షరతు విధించారు.