ఓటిటిలో “వి”
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన నేచురల్‌స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ కరోనా పరిస్థితుల కారణంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఈ సినిమా డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 5న ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. కాగా.. నాని తొలి చిత్రం ‘అష్టాచమ్మా’కు, నాని 25వ చిత్రం ‘వి’ మధ్య రెండు ఆసక్తికరమైనఒకే రకమైన విషయాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది.. నాని తొలి చిత్రం అష్టాచమ్మా సెప్టెంబర్ 5న విడుదలైంది. ‘వి’ సినిమా కూడా అదే రోజున విడులవుతుందని టాక్. అలాగే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒకరే కావడం యాదృచ్చికం. అయితే నాని మొదటి సినిమా హిట్ అయినట్టే 25వ సినిమాకూడా విజయవంతం అవుతుందేమో ఎదురుచూదల్సిందే.