రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.23-7-21,శుక్రవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాజోలు MRO బి. మురళీముక్తేశ్వరరావు గారు రాజోలు మండలం రాజోలు గ్రామానికీ చెందిన దేవళ్ళ సుబ్బారావు గారికి 2వ. ఆక్సిజన్ సిలెండర్ ను మరియు గన్నవరం మండలం మొండుపులంక గ్రామానికి చెందిన గిడుగు శ్రీనెతికొండ గారికీ 3వ. ఆక్సిజన్ సిలెండర్ ను సంబంధిత బందువులకు ఇవ్వడం జరిగింది..

ఈ సందర్భంగా MRO గారు మాట్లాడుతూ రాజోలు మండలం లో కరోనా కేసు ఎక్కువగా పెరగడం వలన ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు..

మా ఆహ్వానాన్ని మన్నించి రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు కు వచ్చిన MRO శ్రీ బి. మురళీముక్తేశ్వరరావు గారి రాజోలు తాలుకా చిరంజీవి -పవన్ సేవా సమితి తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife