పవర్ స్టార్ బర్త్ డే గిఫ్టుగా ‘వీరమల్లు’ మేకింగ్ వీడియో!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్వరలో ఆయన ‘హరిహర వీరమల్లు’ సెట్స్ పైకి వెళతారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

మొగల్ రాజుల కాలం .. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఆయన లుక్ కి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వచ్చేనెల 2వ తేదీన పవన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.