సునీల్ ప్రధాన పాత్రలో ‘కనబడుటలేదు’.. 13న విడుదల

సునీల్ ప్రధాన పాత్రలో తాజాగా చేస్తున్న సినిమానే ‘కనబడుటలేదు’. నిన్న ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ .. ప్రేమికులు ఇల్లు వదిలి పారిపోవడానికి ప్రయత్నించడం .. ప్రేమికుడు కనిపించకుండా పోవడం .. ఆ కేసు డిటెక్టివ్ రామకృష్ణ చేతికి రావడం వంటి అంశాలతో ట్రైలర్ కొనసాగింది.

ఈ కేసు టేకప్ చేసిన వారు ఆ తరువాత అదృశ్యం కావడం, డిటెక్టివ్ రామకృష్ణను కలవరపెడుతుంది. దాంతో ఆయన ఆ కేసును ఎలా డీల్ చేయాలా అనే విషయంలో రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెడతాడు. ఆ కేసు పరిశోధనలో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ఉత్కంఠ భరితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.   

సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ కలిపితీసినట్టుగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. స్పార్క్ సంస్థవారు నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా బాలరాజు పరిచయమవుతున్నాడు. రవివర్మ .. ప్రవీణ్ .. కిరీటి ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువగా నూతన నటీనటులే కనిపిస్తున్నారు.