థర్డ్ వేవ్ లేనట్టే.. స్కూల్స్ తెరుచుకోవచ్చు: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున.. పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది వైద్య ఆరోగ్య శాఖ. థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని ..ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ.పాఠశాలలు తెరుచుకోవచ్చని సూచించింది. ఏడాదిన్నరగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోకపోవడం వల్ల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని విద్యాశాఖాధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్ విధానానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యతపై పెను ప్రభావం చూపెడుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ చేసిన సూచనలపై విద్యాశాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తకమికపడుతున్నారు.

కొన్ని రాష్ట్రాలు అయితే.. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో పాఠశాలలు తెరవడమే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 9, 10వ తరగతులకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పి.. మిగతా క్లాసులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని అంటున్నారు. మరికొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలంటున్నారు.