కాకినాడలో ‘లాల్‌సింగ్ చద్దా’ .. ఆమిర్‌ఖాన్‌పై పలు సీన్ల చిత్రీకరణ

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలో జరగనుంది. ఇందులో భాగంగా నిన్న ఆమిర్‌ఖాన్ కాకినాడ వచ్చారు. విషయం తెలిసిన ఆభిమానులు ఆయన బసచేసిన హోటల్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా, నేడు రేపు ఆమిర్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. నేడు అమలాపురంలో, రేపు కాకినాడ బీచ్‌లో ఆమీర్‌ఖాన్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.