హుజూరాబాద్ కి 2000 కోట్లు మంజూరు: హరీష్ రావు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ. ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్నం అని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పూర్తి దళిత బంధు కుటుంబాలకు అందిస్తాం. రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. రైతు బంధు కు చప్పట్లు కొట్టిన నేతలు, దళిత బంధు కు గుండెలు కొట్టుకుంటున్నారు. ఇక హుజురాబాద్ కోసం 2000 కోట్ల కేటాయింపుపై క్యాబినెట్ తీర్మానం తీసుకుంది అని తెలిపారు. 20 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో లబ్ది జరుగుతుంది. సీఎం దళిత అభివృద్ధికి ఎంపవర్మెంట్ ను బడ్జెట్ లొనే తీర్మానం చేసాం. సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతల్ని చెప్పాలిసింది పోయి నిరసనలు తెలుపుతున్నారు.

ఇక బండి సంజయ్ దళిత బంధు కు 50 లక్షలియ్యాలన్నారు. మేం 10 ఇచ్చినం..కేంద్రం నుండి మీరు 40 లక్షలివ్వండి. నరేంద్ర మోడీ కి బండి సంజయ్ కి పాలాభిషేకం చేస్తాం. 15 మంది కుటుంబాలకు అందజేస్తాం. మునిసిపల్ వార్డ్ కో ఆర్డినటర్, గ్రామ సభ ద్వారా లబ్ది దారుల ఎంపిక జరుగుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ ల మధ్య ప్రజల మధ్య పారదర్శకంగా ఎంపిక చేస్తాం. ఎన్ని కుట్రలు చేసిన దళిత సోదరులకు పథకం అందిస్తాం. ప్రతిపక్షాల కుట్రల ఆనందం తాత్కాలికమే అని పేర్కొన్నారు.