వివేక హ‌త్య‌కేసులో న‌లుగురిని విచారిస్తోన్న సీబీఐ అధికారులు

మాజీ మంత్రి దివంగత‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే.  కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మంది అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. ఈ రోజు పులివెందులకు చెందిన ఉమాశంకర్, భరత్, రసూల్, మున్నీసాను విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు వారిని ప్ర‌శ్నిస్తున్నారు.

ఉమాశంకర్, భరత్ ను ఇప్ప‌టికే ప‌లుసార్లు అధికారులు విచారించ‌గా, రసూల్, మున్నీసా మాత్రం మొదటిసారిగా సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. వివేక‌ హ‌త్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్ర‌శ్నిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా మరికొంత మంది అనుమానితులను అధికారులు విచారించే అవకాశం ఉంది.