పాలకూరతో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూరను ఏ విధంగా నైనా సరే రోజువారీ తినే ఆహార పదార్థాలలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, మీశరీరం కరోనా వైరస్ తో పోరాడే శక్తి ని పొందడానికి పాలకూర ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోoడి.  

  • పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తుంది.
  • పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
  • పాలకూరలో లభించే విటమిన్‌ C, Aలు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి.
  • పాలకూరలో విటమిన్-A మీ కంటి చూపు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, అలానే మీ కళ్ళ మంటలను కూడా నిరోధిస్తుంది.
  • శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
  •  జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది.
  • పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది.
  • ఈ పాలకూరలో విటమిన్ K పుష్కలంగా లభించడం వల్ల మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచబడుతుంది.

ఈ పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్ మొదలైన వాటితో పూర్తిగా నిండి ఉండుట వలన మధుమేహం,  క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది.