ఎస్పీ చరణ్ ఎమోషనల్ వీడియో

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ”మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను” అంటూ వణుకుతున్న గొంతుతో చరణ్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి.

బాలు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు తమిళ సినీ పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎస్పీ బాలు అభిమానులు సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు.