సాగర కన్య షాకింగ్ నిర్ణయం.. రాజ్‌కుంద్రాతో విడాకులు!

రెండు నెలల క్రితం అశ్లీల చిత్రాల కేసులో భర్త రాజ్ కుంద్రా ఇరుక్కుపోవడంతో హీరోయిన్ శిల్పాశెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త రాజ్ కుంద్రాకు విడాకులు ఇవ్వనున్నట్లు సమాచారం. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో పోర్న్ చిత్రాలు తీసి రాజ్ కుంద్రా కోట్లు కొల్లగొడుతున్నాడనే ఆరోపణలతో అరెస్ట్ కావడం ఆమె ప్రతిష్టను మసకబార్చింది. భర్త అరెస్ట్ కావడంతో ఆమె కొన్నిరోజులుగా సినిమా షూటింగులకు కూడా హాజరుకావడం లేదు.

ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి ఇటీవల తన తప్పును ఒప్పుకున్నట్లు ఓ పోస్ట్ పెట్టడం కూడా పలు అనుమానాలకు దారి తీసింది. ఆ పోస్టులో ‘అందరూ తప్పులు చేస్తారు. అయితే ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు. తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను’ అంటూ శిల్పాశెట్టి పేర్కొంది. దీంతో రాజ్ కుంద్రా నుంచి విడిపోవాలని శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.