పేకాట శిబిరంపై ఎస్వోటీ దాడులు.. సినీ హీరో అరెస్ట్
ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. మియాపూర్‌లోని పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు నిన్న రాత్రి దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న నటుడు కృష్ణుడు సహా 8 మందిని అరెస్టు చేశారు.పేకాటరాయుళ్లను మియాపూర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై నిందితులను పోలీసులు నిన్న రాత్రి ఇళ్లకు పంపించి వేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని వారిని ఆదేశించారు.