జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. వాగులు వంకలు, ప్రాజెక్లులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో.. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.

ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజలు నిర్వహించారు.. ఆలయ ప్రాంగణంలో.. మంజీర పరివాహక ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు.