Hyderabad: గణేష్ ఉత్సవాలు..నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేక కుంటల్లో వాటిని నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.