లవ్ స్టోరీ రిలీజ్ పై మరో అప్డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ అన్ని విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఆఖరికి వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా వీలు పడలేదు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.