తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పయనించే అవకాశం ఉంది. అలాగే, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఇంకోవైపు, పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.